VIDEO: సెల్‌ఫోన్ టవర్ ఎక్కిన వ్యక్తి క్షేమం
GNTR: ఫిరంగిపురంలోని విజ్ఞానపురానికి చెందిన ఒక వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. సమాచారం అందుకున్న ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణ, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామంటూ సీఐ హామీ ఇవ్వడంతో చివరికి ఆ వ్యక్తి టవర్ నుంచి క్షేమంగా కిందికి దిగాడు.