'ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం'
అన్నమయ్య: సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ 57వ ఆవిర్భావ దినోత్సవం రాయచోటి బస్టాండ్ వద్ద ఇవాళ ఘనంగా జరిగింది. జెండా ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాధ్ మాట్లాడుతూ.. పార్టీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.