హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ
NRPT: హోంగార్డు వ్యవస్థ పోలీస్ శాఖలో అంతర్భాగమని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ వినీత్ అన్నారు. NRPT ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో 63వ హోంగార్డు రైజింగ్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రాలు, క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం హోంగార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.