VIDEO: ఎల్కతుర్తిలో పట్టపగలే భారీ బంగారం చోరీ
HNK: ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో బుధవారం పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని లోపలికి చొరబడ్డ దుండగులు సుమారు 5 తులాల బంగారం, లక్ష యాభై వేల రూపాయల నగదును అపహరించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.