తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం
BHNG: భువనగిరిలోని శ్రీ ఆర్ కె హాస్పిటల్ ఆధ్వర్యంలో తుర్కపల్లిలోని తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తారక్ డయాగ్నొస్టిక్ సెంటర్ మరియు చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నందు తుర్కపల్లి పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, న్యూరోపతి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.