ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన సబ్ కలెక్టర్
MNCL: తాండూర్ మండలం కొత్తపల్లి ఇందిరమ్మ కాలనీని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సోమవారం సందర్శించారు. 2007లో పట్టాలు ఇచ్చినా రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం లేక ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నామని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని కోరగా, స్పందించిన సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.