VIDEO: ముంచెత్తిన పొగ మంచు.. ఇబ్బందులు పడ్డ ప్రజలు
కోనసీమ: రావులపాలెం మండలం పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు దుప్పటిలా కమ్ముకుంది. పక్కనున్న వ్యక్తులు కూడా కనిపించని స్థితిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే పనులు చేసుకునే రైతులు, కూలీలు అవస్థలు పడ్డారు. మంచు వల్ల పంటలకు భారీగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.