ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ

NLG: దేవరకొండ రాజస్వ మండలాధికారి ఆర్డీఓ రమణారెడ్డి శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, అందుతున్న వైద్య సేవలపై రోగులతో నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వసతులు, మందుల పంపిణీపై ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.