ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

SRPT: ఆత్మకూరు ఎస్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో వెంకట రమణ ఇవాళ తనిఖీ చేశారు. ముందుగా హాజరు పట్టిక, ఓపీ, కాన్పుల రిజిస్టర్‌లను పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విధులకు సంబంధించి సమయపాలన పాటించాలని సూచించారు.