ఆలయానికి రోబోటిక్‌ ఏనుగు.. సోనూసూద్‌ గిఫ్ట్

ఆలయానికి రోబోటిక్‌ ఏనుగు.. సోనూసూద్‌ గిఫ్ట్

చెన్నై ఆవడిలోని శ్రీశక్తి వినాయగర్ ఆలయానికి బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఆయన కుమారుడు అయాన్‌సూద్ రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చారు. ఆవడి ఆర్డినెన్స్ క్లాతింగ్ కంపెనీ అభ్యర్థన మేరకు అందించారు. ఓసీఎఫ్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో స్థానికులు ఈ గజరాజుకు స్వాగతం పలికారు. 12 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువుండే దీని విలువ రూ.6.50 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.