VIDEO: వరి కొనుగోళ్లలో జాప్యం.. ఆందోళనలో రైతులు

MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో IKP, PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో వరితూకం వేయడం జాప్యమవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క అకాల వర్షాలు పడుతుండటంతో వరి దాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించి రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు.