జాతర ఉత్సవాల్లో రక్తదాన శిబిరం

జాతర ఉత్సవాల్లో రక్తదాన శిబిరం

SRD: రాయికోడ్ మండల కేంద్రంలో వీరభద్రేశ్వర జాతర సందర్భంగా మహా రక్త దాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. సంగారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్యులు నవనీత్, స్టాప్ నర్స్ సునీత, లలిత వైద్యబృందం రక్తదాతల నుంచి రక్తం శాంపిళ్లను సేకరించారు. ఇందులో చాలామంది యువకులు అతి ఉత్సాహంతో పాల్గొని రక్త దానం చేశారు. రక్తదాతలకు వైద్యాధికారులు ధ్రువపత్రాలను అందజేశారు.