VIDEO: గాలివాన బీభత్సం

VIDEO: గాలివాన బీభత్సం

ASR: పెదబయలు మండలం గబుడుపట్టులో మంగళవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామంలో గల గెమ్మెలి తరుణ్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి లోపల గల సామగ్రి, బియ్యం, ధాన్యం మొదలైనవన్నీ తడిసి ముద్దయ్యాయి. తలదాచుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.