ఆలయ పునఃనిర్మాణం కోసం విరాళాలు

ఆలయ పునఃనిర్మాణం కోసం విరాళాలు

KMR: మద్నూర్‌లోని పాత బస్టాండ్ వద్ద ఉన్న పురాతన హనుమాన్ మందిరం పునఃనిర్మాణం కోసం పలువురు దాతలు మంగళవారం విరాళాలు అందజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంగ్శెట్టి సంతోష్ రూ. 21,000, తుల్జా భవాని గ్రూప్ సభ్యులు రూ.11,000 విరాళంగా ఇచ్చారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గంగాధర్, విఠల్, ప్రకాష్, రఘు తదితరులు పాల్గొన్నారు.