పాంబండ ఛైర్మన్‌గా మైపాల్ రెడ్డి బాధ్యతలు
VKB: కుల్కచర్ల మండలంలో ప్రసిద్ధ శ్రీ పాంబండ రామలింగేశ్వర దేవస్థానం ఛైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించగా, ఛైర్మన్ పదవిని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన మైపాల్ రెడ్డికి అప్పగించింది. గత పాలకవర్గం గడువు ముగియడంతో, శనివారం నుంచి కొత్త కమిటీ కార్యకలాపాలు ప్రారంభించనుంది.