చిన్నారులను కొండగట్టుకు తీసుకెళ్లిన మాజీ కౌన్సిలర్

కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణంకు హాజరయ్యే చిన్నారులతో 40వ వార్డు మాజీ కౌన్సిలర్ విజయ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం కొండగట్టుకు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. వేములవాడ, నాంపల్లిలోని ఆలయాలు సందర్శిస్తారు. నిర్వహణ కమిటీ సభ్యులు నరసింహులు, సాయిలు, శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు.