'మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు'

KMM: మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ అన్నారు. ఖమ్మం డివిజన్ శ్రీనివాస నగర్‌లో గురువారం జరిగిన సంఘం ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జనాభాలో సింహ భాగం ఉన్న మున్నూరు కాపులకు రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని అన్నారు.