గుమ్లాపూర్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

KNR: చొప్పదండి మండలం గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓపీ రికార్డులను తనిఖీ చేసి, ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్‌లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఆధార్, ఫోన్ నెంబర్ సేకరించి నూరు శాతం ఆయుష్మాన్ భారత్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అన్నారు.