చిల్డ్రన్ పార్క్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి

చిల్డ్రన్ పార్క్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి

సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి బ్రిడ్జి సమీపంలో జోయ్ అలుకాస్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ పార్క్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల ప్రగతిని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆదివారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నవంబర్లో సత్యసాయి శతజయంతి వేడుకలు జరుగుతాయని, ఆలోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.