ఈ నెల 18 మెగా రక్తదాన శిబిరం

ఈ నెల 18 మెగా రక్తదాన శిబిరం

ములుగులో ఈ నెల 18 మెగా రక్తదాన శిబిరం నిర్వహించనునట్లు అదనపు కలెక్టర్ సంపత్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి, రెడ్ క్రాస్, ములుగు ఆస్పత్రుల కోసం 500 యూనిట్లకు తగ్గకుండా రక్తం సేకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. ఆర్&బీ అతిథి గృహంలో జరగునున్న ఈ శిబిరంలో స్వచ్ఛంద పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.