రామగుండం కార్పొరేషన్‌లో ఆకట్టుకుంటున్న సందేశాత్మక చిత్రాలు

PDPL: రామగుండం కార్పొరేషన్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు కనిపించే విధంగా సందేశాత్మక చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణ, సీజనల్ వ్యాధుల సంక్రమణ ముందు జాగ్రత్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా అభ్యున్నతిని తెలియజేస్తున్నాయి.