శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గాళం దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన మంత్రి దంపతులకు TTD ఛైర్మన్ BR నాయుడు, EO అనిల్ కుమార్ సింఘాల్, JEO, ఆలయ అర్చకులు స్వాగతం పలికి మహాద్వారం గుండా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.