రాహుల్ యాత్రలపై అమిత్ షా విమర్శలు
బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న యాత్రలు దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులను కాపాడటానికే అని ఆయన ఆరోపించారు. అయితే, రాహుల్ ఎన్ని యాత్రలు చేసినా చొరబాటుదారులను దేశం నుంచి తరిమి కొడతామని స్పష్టం చేశారు.