సింహాద్రి అప్పన్న ఆలయంలో గరుడ సేవ
VSP: సింహాచలం వరాహా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.