'గ్రామాలలో మౌలిక వసతులపై దృష్టి సారించండి'
ప్రకాశం: కనిగిరి మండలంలోని అన్ని గ్రామాలలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టికి సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర సింహారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రధానంగా నీటి సమస్య, విద్యుత్, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచించారు.