మద్యం దుకాణాల టెండర్ల ఫీజు పెంపు

మద్యం దుకాణాల టెండర్ల ఫీజు పెంపు

TG: మద్యం దుకాణాల టెండర్ల ఫీజు ఖరారైంది. రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ చెల్లించి టెండర్లలో పాల్గొనాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇది రూ.2 లక్షలే ఉండగా.. ప్రస్తుతం దాన్ని పెంచింది. నగరాల్లో లైసెన్స్ ఫీజును రూ.10 లక్షలకు పెంచింది. కానీ, కాలపరిమితి మాత్రం పాత పద్ధతిలోనే 2 ఏళ్లకే పరిమితం చేసింది. అయితే, టెండర్ల స్వీకరణ తేదీలు ఇంకా ప్రకటించలేదు.