పైపులు లీకేజీతో రోడ్డుపైకి నీరు.!
ELR: ఉంగుటూరులోని కొత్తగూడెం రహదారిలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, పాత రోడ్డును తొలగించే క్రమంలో అక్కడున్న మంచినీటి పైపులైన్‌లు పగిలిపోయాయి. నీరంతా రోడ్డుపై నిలిచిపోయి, ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. అక్కడ ప్రజలు తాగునీరుకి నానా ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.