టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
CTR: వి.కోట మండలంలో “మన ఊరికి - మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పర్యటనకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు.