జిల్లాలో పోలీసుల తనిఖీలు..భారీగా నగదు పట్టివేత

WNP: జిల్లాలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా రూ.2,01,500లు, 10లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి అన్నారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.80వేలు, కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.70వేలు, పెద్దమందడి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.51,500లు స్వాధీనం చేసుకున్నామని ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేసినట్లు చెప్పారు.