VIDEO: ఒంటరిగా పాత బజార్‌లో పర్యటించిన ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత బజార్, కాలనీలలో ఆకస్మికంగా పర్యటించారు. గన్‌మెన్‌లు, నాయకులు, పోలీసులు లేకుండానే మార్నింగ్ వాక్‌లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి అక్కడికక్కడే సూచనలు, సలహాలు చేశారు.