అధికారుల డుమ్మా.. ఎంపీడీవో అసహనం

NLR: సంగం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు డుమ్మా కొట్టడంతో ఎంపీడీవో షాలెట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3నెలలకు ఒకసారి జరిగే సమావేశాలకు హాజరు కాకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ఇటు వంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వీ జవాన్ మురళీ మృతికి రెండు నిమిషాల మౌనం పాటించారు.