రేపు పంచాయతీ వేలం పాట

రేపు పంచాయతీ వేలం పాట

భద్రాద్రి: ఇప్పటికి రెండుసార్లు వాయిదాపడిన చర్ల మేజర్ గ్రామపంచాయతీ పరిథిలోని మార్కెట్ ఆశీలు, పశువుల సంత తదితర వేలం పాటలను శనివారం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి కృష్ష తెలిపారు. ఇప్పటికే డిపాజిట్ కట్టిన వారితోపాటు కొత్తవారు అవసరమైన పత్రాలు సమర్పించి డిపాజిట్ కట్టి వేలం పాటలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.