ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

SKLM: నందిగాం మండలం కర్లపూడి గ్రామంలో శుక్రవారం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఐకమత్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు సమీప గ్రామ భక్తులు పాల్గొన్నారు.