సభ స్థలాన్ని పరిశీలించిన రేంజ్ డీఐజీ
PPM: డిసెంబర్ 5న, పాలకొండ మండలం భామినిలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో సభ స్థలాన్ని, భద్రత ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, ఎస్పీతో కలసి ఇవాళ పరిశీలించారు. ముఖ్యమంత్రి దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. బందోబస్తుపై పలు సూచనలు చేశారు.