జగనన్న లే అవుట్లను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు

ATP: ఉరవకొండలోని జగనన్న లే అవుట్లను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో లే అవుట్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, భూ యజమానుల వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు విక్రయించారా? లేదా? అన్న కోణంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.