స్టాక్ మార్కెట్ పేరుతో రూ.1.20 కోట్ల మోసం: జిల్లా ఎస్పీ
ADB: స్టాక్ మార్కెట్ పేరుతో 25 మందిని మోసం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జావీద్, కొత్తపెల్లి గంగాధర్‌లో అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి వారి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్కులు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు.