డిసెంబర్ 2 నుంచి ప్రత్యేక ప్రవేశాలకు అవకాశం

NZB: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రత్యేక ప్రవేశాలకు వచ్చే నెల 2 నుంచి 11 వరకు అవకాశం కల్పించారని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ రుసుం టీఎస్ ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్నివిద్యార్ధులు వినియోగించుకోవాలని సూచించారు.