భారీ వర్షాలు.. పూర్తిగా నీట మునిగిన కారు

ఢిల్లీని భారీ వర్షాలు ముంచెస్తున్నాయి. వానల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాంట్ ప్రాంతం పూర్తిగా నీటిలో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఓ కారు పూర్తిగా మునిగిపోయింది. అలాగే ఓ బస్సుకు సగానికి పైగా నీరు చేరాయి. దీంతో కాంట్ ప్రాంతానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కారు మునిగిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.