వీల్‌చైర్ల దుర్వినియోగంపై కిరణ్‌ మజుందార్ షా ఆగ్రహం

వీల్‌చైర్ల దుర్వినియోగంపై కిరణ్‌ మజుందార్ షా ఆగ్రహం

విమానాశ్రయాల్లో భారతీయ ప్రయాణికులు వీల్‌చైర్లను దుర్వినియోగం చేస్తున్నట్లు ఉన్న వీడియోపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా తీవ్రంగా స్పందించారు. ఇటువంటి అనవసర దుర్వినియోగ చర్యలను నిరోధించాలంటే, ప్రతి వీల్‌చైర్ సేవకు అదనంగా రూ.5,000 వసూలు చేయాలని ఆమె సూచించారు. అవసరం లేకపోయినా వీల్‌చైర్లను ఉపయోగిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.