భగీరథ మహర్షి ఆశయాలు ఆదర్శం: అదనపు కలెక్టర్
GDWL: భగీరథ మహర్షి ప్రతి ఒక్కరికి ఆదర్శమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఇవాళ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తపోశక్తితో గంగను భూమికి తీసుకువచ్చిన మహర్షి స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సగర సంఘం నేతలు పాల్గొన్నారు.