ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం
ADB: సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఆత్రం నగేశ్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరిపారు. నూతన సర్పంచ్ నగేశ్‌ను పార్టీ నాయకులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.