VIDEO: రేగుమానిపల్లి సచివాలయంలో అందుబాటులో లేని సిబ్బంది
ప్రకాశం: రేగుమాని పల్లి సచివాలయం 2 గంటలకే ఖాళీ కుర్చిలతో దర్శనమిచ్చింది. సచివాలయంలో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో పలు అవసరాల నిమిత్తం వచ్చిన గ్రామస్తులు వెనుదిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి సిబ్బంది సమయపాలన పాటించేలా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.