మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి

మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వేదికపై మాట్లాడిన మంత్రి, అభివృద్ధి పేరుతో గతంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇక తావు ఉండదని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.