కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి
MHBD: తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వేల్పుల వెంకన్న తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.