తీన్మార్ మల్లన్నకు అచ్చంపేట సమస్యల వివరణ

NGKL: అచ్చంపేట పట్టణంలోని సర్వే నంబర్ 26, 27 బాధితులు ఆదివారం తీన్మార్ మల్లన్నను కలుసుకుని తమ సమస్యను వివరించారు. బాధితుల సమస్యను విన్న ఆయన వెంటనే ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు ఫోన్ చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బాధితులకు మల్లన్న తెలిపారు.