అన్నపురెడ్డిపల్లిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

అన్నపురెడ్డిపల్లిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

BDK: అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో అక్రమంగా రవాణా చేస్తున్న 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AP నుంచి కడియం గ్రామానికి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని ఏఎస్ఐ సర్దార్, కానిస్టేబుల్ రాంబాబు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.