పోలీసులపై కాల్పుల యత్నం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన ఘటన శనివారం జరిగింది. అయితే బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపేందుకు యత్నించాడు. గన్ ట్రిగ్గర్ లాక్ అవడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని పట్టుకుని, అతని నుంచి 9MM పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.