నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కృష్ణా: ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం తెలిపారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.