సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
BPT: సీఎం చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. సూరేపల్లిలో రైతులకు రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సీఎం పర్యటన కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్, ప్రజావేదిక నిర్మాణ పనులు, కార్యకర్తల సమావేశం ప్రాంతాలను నిన్న పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను హాజరు కావాలన్నారు.