VIDEO: చెట్టును ఢీకొట్టిన కారు.. తీరా చూస్తే గంజాయి

VIDEO: చెట్టును ఢీకొట్టిన కారు.. తీరా చూస్తే గంజాయి

BDK: సాయన్న పేట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే రోడ్డుపై వస్తున్న కారు డ్రైవర్ లాల్ సింఘ్ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నంలో చెట్టును ఢీకొట్టాడు. వెళ్లి చూడగా కారు డిక్కీలో 200 కేజీల గంజాయి బయటపడింది. గంజాయితో పాటు 2 ఫోన్లు స్వాధీనం చేసుకుని లాల్ సింఘ్‌ను అరెస్ట్ చేశారు. అతడు గతంలో కూడా అరెస్ట్ అయినట్లు వెల్లడించారు.